తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్

SMTV Desk 2019-03-22 17:31:24  congress

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఈ మధ్య వరుసగా కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా షాకులు తగులుతున్నాయి. అందులో భాగంగా గత ఎన్నికల్లో గెలిచిన వారు.. మాజీ నేతలు పార్టీకి గుడ్ బై చెబుతూ ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు ఇస్తున్నారు.

అదేవిధంగా ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. తాజాగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీకి ఎంతో నిబద్ధతతో పని చేశానని.. పార్టీ తన పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదిగే అవకాశాలు లేవని ఆయన ఆరోపించారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించినట్లు తెలిపారు. అయితే ఇంకా తాను ఏ పార్టీలో చేరలేదని త్వరలో నిర్ణయించుకుంటానని రాపోలు ఆనందభాస్కర్ వివరించారు.