గంభీర్ పొలిటికల్ ఎంట్రీ...ఫన్నీ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్

SMTV Desk 2019-03-22 17:30:36  gautam gambhir, political entry, bjp, indian cricketer

మార్చ్ 22: తాజాగా రాజకీయరంగ ప్రవేశం చేసిన భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై తన అభిమానులు సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ రోజు బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవి శంకర్ సమక్షంలో ఈరోజు ఉదయం గౌతమ్ గంభీర్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ‘దేశానికి ఏదైనా మంచి చేసేందుకు ఇది నాకు అద్భతమైన వేదిక. కచ్చితంగా నేను అత్యుత్తమంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తా’ అని పార్టీలో చేరిన తర్వాత గంభీర్ వెల్లడించాడు. ప్రస్తుతం న్యూఢిల్లీ నియోజకవర్గం ఎంపీగా ఉన్న మీనాక్షి పనితీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ఆమెకి తాజా ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కుదరదని ఇప్పటికే బీజేపీ చెప్పినట్లు సమాచారం. దీంతో.. అక్కడ నుంచి గంభీర్ పోటీచేసే అవకాశం ఉంది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టులో సభ్యుడిగా ఉన్న గంభీర్.. సుదీర్ఘకాలం ఓపెనర్‌గా సేవలు అందించాడు. అలానే ఐపీఎల్‌లోనూ కోల్‌‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడి.. కెప్టెన్‌గా ఆ జట్టుని రెండుసార్లు విజేతగా నిలిపాడు.