నరేష్ ఇప్పటి నుంచైనా మేము అనే పదం వాడితే బాగుంటుంది : రాజశేఖర్

SMTV Desk 2019-03-22 17:25:56  Naresh, Rajasekhar,

హైదరాబాద్: ‘మా’ అధ్యక్షుడిగా నరేష్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడి నరేస్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అతడి వ్యాఖ్యలపై నటుడు రాజశేఖర్ తప్పుబట్టాడు. ‘మా’ కోసం నేను అహర్నిశలు కష్టపడి అభివృద్ధిలోకి తెస్తానని పలుమార్లు అనడంతో రాజశేఖర్ దంపతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నరేష్ ప్రతిది నేను, నేను అని సంభోదించడం తప్పని రాజశేఖర్ సూచించారు. రాజశేఖర్ జీవిత మాట్లాడిల్సిందిగా మిగితా నటులు కోరారు. దీంతో నరేష్ అన్నీ మాట్లాడేశారని, తాము మాట్లాడేది ఏమీ లేదని, ముందు ముందు చాలా మాట్లాడుతానని చెప్పి అక్కడి నుంచి రాజశేఖర్ నిష్క్రమించారు. ఈ కార్యక్రమానికి తనకు తానుగా రాలేదని, నరేష్ వచ్చి పిలిస్తేనే వచ్చామన్నారు. నరేష్ ఇప్పటి నుంచైనా మేము అనే పదం వాడితే బాగుంటుందని జీవిత సూచించారు. పక్కనే ఉన్న నరేష్ కల్పించుకుని తానేదో సరదాగా మాట్లాడానని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరి కలిసి అభివృద్ధి చెందామని సర్ది చెప్పారు.