మా’ అధ్యక్షుడిగా నరేష్ ప్రమాణ స్వీకారం

SMTV Desk 2019-03-22 17:23:29  Maa President, naresh,

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేష్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది. సీనియర్ నటుడు నరేష్ కొత్త అధ్యక్షుడిగా, హీరో రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా, జీవిత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అయితే, కొంతకాలంగా నరేష్ కు శివాజీ రాజాకు మధ్య అభిప్రాయభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నరేష్ ప్రమాణస్వీకారోత్సవానికి కొంచెం సమయం పట్టింది. కాగా, ఈరోజు ప్రమాణస్వీకారానికి శివాజీరాజా కూడా హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ‘మా’ కమిటీ భవిష్యత్తులో అద్భుతాలు చేయాలని, ఎప్పటిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానని చెప్పారు శివాజీ రాజా. తన నుంచి ఏ సాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధమేనని చెప్పారు. ఈ సందర్భంగా ‘మా’ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని కమిటీ రూపొందించగా, ఈ పాటను సూపర్‌స్టార్‌ కృష్ణ దంపతులు, కృష్ణంరాజు దంపతుల చేతుల మీదుగా విడుదల చేశారు.