పల్సర్ 220 లుక్ లో 180 న్యూ వెర్షన్ రిలీజ్....

SMTV Desk 2019-03-22 17:21:41  Bajaj Pulsar 180F Neon, Bajaj , Pulsar

మార్చ్ 22: బజాజ్ కంపెనీ తాజాగా తన పల్సర్ 180లో మరో కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పల్సర్ 180 నియాన్ అనే పేరుతో విడుదలైన ఈ బైక్ మోడల్ పల్సర్ 220 ఎఫ్‌ మోడల్ డిజైన్‌ను పోలి ఉంటుంది. అయితే బైక్ ఇంజిన్, ఇతర ప్రత్యేకతల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. బైక్ లుక్ విషయానికి వస్తే.. ఇది బ్లాక్, ఆరెంజ్ రంగుల కలయికతో ఉంటుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.87,450. రెగ్యులర్ 180 బైక్‌తో పోలిస్తే దీని ధర రూ.2,000 ఎక్కువ. ఈ బైక్‌లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, గ్రాబ్ రెయిల్స్, ఆరెంజ్ కలర్ పల్సర్ లోగో వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఇందులో 178.6 సీసీ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. దీని మాగ్జిమమ్ పవర్ 17.02 హెచ్‌పీ@8,500 ఆర్‌పీఎం, మాగ్జిమమ్ టార్క్ 14.22 ఎన్ఎం@6,500 ఆర్‌పీఎం. ఐదు గేర్లు ఉంటాయి. ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 15 లీటర్లు. టాప్ స్పీడ్ 118 కిలోమీటర్లు.