గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయిన శివాజీ

SMTV Desk 2019-03-22 16:24:14  actor shivaji, lok sabha elections, assembly elections, election commission officer, gopalakrishna dwivedi

అమరావతిచ, మార్చ్ 22: సినీ నటుడు శివాజీ ఏపిలో జరుగుతున్న ఐటి దాడులపై, జిఎస్టీ దాడులపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ఎన్నికల సందర్భంగా ఏపిలో విచ్చలవిడిగా ఐటి, జిఎస్టీ దాడులు చేస్తున్నారని, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. బ్యాంకుల నుంచి మనీ తీసుకెళ్తుండగా తగిన ఆధారాలు చూపించినా నగదు సీజ్‌ చేయడంపై ద్వివేది దృష్టికి తీసుకెళ్లారు. సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండి చర్యలు తీసుకోవాలని సిఈసికి శివాజీ విజ్ఞప్తి చేశారు.