టాటా టిగోర్ బంపర్ ఆఫర్!

SMTV Desk 2019-03-22 15:33:58  Tata Tigor, tata motors, offer

మార్చ్ 22: టాటా మోటార్స్ నుండి విడుదలైన టాటా టిగోర్ కారుపై ఆ కంపెనీ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్లో ఏకంగా లక్ష రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనం పొందొచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. టాటా టిగోర్ ధర ఇప్పుడు రూ.5.42 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. దీంతో మారుతీ బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కన్నా ఈ కారు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. మారుతీ బాలెనో ప్రారంభ ధర రూ.5.46 లక్షలుగా ఉంది. టాటా టిగోర్ దేశీ మార్కెట్‌లో మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో రెండు పెట్రోల్ ఆప్షన్లు. ఒకటి డీజిల్ ఆప్షన్. పెట్రోల్ వేరియంట్లలో 1.2 లీటర్ ఇంజిన్, డీజిల్ వేరియంట్‌లో 1.05 లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు ఫోర్డ్ యాస్పైర్, ఫోక్స్‌వ్యాగన్ అమియో, హోండా అమేజ్, మారుతీ సుజకీ డిజైర్ వంటి వాటికి గట్టి పోటీఇస్తోంది. టాటా టిగోర్‌లో డైమండ్ ఆకారపు గ్రిల్, డ్యూయెల్ చాంబర్డ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయెల్ టోన్ అలాయ్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. అలాగే 7 అంగుళాల ఇన్ఫో‌టైన్‌మెంట్ వ్యవస్థ, ఆండ్రాయిడ్ ఆటో, రివర్స్ పార్కింగ్ కెమెరా, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.