మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లు నిరసన ర్యాలీ

SMTV Desk 2019-03-22 15:03:19  Mohan babu,

ఫీజు రియంబర్స్‌మెంట్ కోసం నటుడు మోహన్ బాబు, విద్యావేత్త, శ్రీ విద్యానికేతన్ విద్య సంస్థల అధిపతి మోహన్ బాబు తిరుపతిలో నిరసన చేస్తున్నారు. మరోవైపు కుప్పంలో ఈరోజు చంద్రబాబు నామినేషన్ దాఖలు చేస్తుండడంతో తిరుపతిలో వాతావరణం వేడెక్కింది. తమ విద్యాసంస్థకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పది వేల మంది విద్యార్థులతో కలిసి మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లు నిరసన ర్యాలీ చేపడుతున్నారు.

తిరుపతిలోని లీలామహల్‌ సర్కిల్‌ నుంచి గాంధీ రోడ్డు వరకూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. అంతకముందు.. మోహన్‌బాబు నిరసనకు దిగనున్నారని సమాచారం రావడంతో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి.. హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయతించగా మోహన్‌బాబు తన విద్యాసంస్థ ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు.