రానా మరోసారి వాయిస్ ఓవర్

SMTV Desk 2019-03-22 15:01:00  rana daggubati. avengers

ఇప్పుడు యావత్తు ప్రపంచం అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది “ఎవెంజర్స్ ఎండ్ గేమ్” అనే చెప్పాలి. మార్వెల్ వారి కామిక్స్ పాత్రల ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు తెరకెక్కాయి.వీరి నుంచి వచ్చిన ప్రతీ సూపర్ హీరోని కలిపి మొదలు పెట్టిన సిరీసే ఈ “ఎవెంజర్స్”.ఇప్పటి వరకు మూడు భాగాలుగా విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపించాయి.అందులోను చివరగా విడుదలైన “ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్” సినిమా అయితే ఏకంగా భారతదేశంలో 200 కోట్లకు పైగా కొల్లగొట్టేసింది.

అంటే ఈ సిరీస్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.ఈ సినిమా మన దగ్గర అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా విడుదలయింది.ఈ సినిమాలోని అత్యంత బలశాలి అయిన ఒకేఒక్క విలన్ “థానోస్” ఈ ఒక్కడిని ఎదుర్కోడానికి ఎవెంజర్స్ అంతా ఎంతో కష్టపడతారు,కానీ అతడు మాత్రం విశ్వంలో ఉన్న అత్యంత శక్తివంతమైన అన్ని అనంత మణులను సొంతం చేసుకొని కేవలం ఒక్క చిటికెతో సగం విశ్వాన్ని నాశనం చేసేస్తాడు.అంతటి బలమైన విలన్ కు బాహుబలిలో అంతే బలమైన విలన్ పాత్ర పోషించిన భల్లాలదేవుడు(రానా) తెలుగులో విడుదలైన “ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కు” వాయిస్ ఓవర్ ఇచ్చారు.

రానా వాయిస్ కూడా ఈ థానోస్ పాత్రకు సరిగ్గా కుదరడంతో తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా మరింత నచ్చేసింది.ఇక ఈ సిరీస్ నుంచి చివరి సినిమాగా “ఎవెంజర్స్ ఎండ్ గేమ్” వచ్చే ఏప్రిల్ 26న ప్రపంచ వ్యాప్తంగా తెలుగులో కూడా విడుదల కానుంది.మరి ఈ సినిమాకి కూడా రానా మరోసారి వాయిస్ ఓవర్ ఇస్తున్నారో లేదో ఇంకా తెలియలేదు.వస్తున్న ఊహాగానాల ప్రకారమైతే మరోసారి థానోస్ కు భల్లాలుడు తన స్వరాన్ని అందించడానికి అవకాశాలు ఎక్కువున్నట్టు అనిపిస్తుంది.ఇంకా నెల రోజులు గడువుంది ఈ మధ్యలో అధికారిక వార్త వస్తే తెలుగులో ఉన్న మర్వెల్ అభిమానులుకి ఇంకాస్త కిక్ ఇచ్చినట్టు ఉంటుంది.