వాయిదా పడ్డ నిఖిల్ మూవీ

SMTV Desk 2019-03-22 14:01:04  Nikhil, Arjun suravaram,

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం టీఎన్ సంతోష్ డైరెక్షన్ లో “అర్జున్ సురవరం” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాను మొదట్లో ఈ నెల 29వ తేదీన విడుదల చేయాలనుకున్నారు.అప్పట్లో ఏప్రిల్ 30న ఎన్నికలు ఉండబోతున్నాయంటూ ఊహాగానాలు రావటంతో మార్చి 29ని రిలీజ్ కు అనుకూలమైన తేదీగా భావించింది సినిమా యూనిట్. తీరా చుస్తే, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు రానున్నాయంటూ షెడ్యూల్ విడుదలైంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకి ఎన్నికలకి 10 రోజుల దూరం ఉన్న సమయంలో విడుదల చేయడం కరెక్ట్ కాదని ఈ సినిమా టీమ్ భావిస్తోందట. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నికల ప్రచారం మంచి ఊపుతో జరుగనుండటం, ఎలక్షన్ హడావిడి గురించే జనమంతా మాట్లాదుకుంటూ దృష్టి అంతా కూడా రాజకీయ పరిణామాలపైనే ఉండనుండటం వల్ల సినిమాకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి మే1వ తేదీకి వాయిదా వేయాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.