వెంకీ కూతురు పెళ్లి డేట్ ఫిక్స్

SMTV Desk 2019-03-22 14:00:22  Venky, venkatesh, daugter

హైదరాబాద్ : ఈ వారంలోనే విక్టరీ వెంకటేశ్ కూతురు ఆశ్రిత పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ రామసాని సురేందర్ రెడ్డి మనువడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత నిశ్చితార్థం ఇటీవల మణికొండలో జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిపిందే. రాజస్థాన్ లో ఈ వారమే వారి పెళ్లి జరగనుందని సమాచారం. అయితే ఆశ్రిత, వినాయక్ రెడ్డి పెళ్లి వార్తలను వెంకటేశ్ కుటుంబంతో పాటు సురేందర్ రెడ్డి కుటుంబం కూడా ధృవీకరించలేదు. ఆశ్రిత, వినాయక్ రెడ్డిల పెళ్లి రాజస్థాన్ లో జరగనుందని సమాచారం. ఇప్పటికే పెళ్లి పనులు పూర్తయ్యాయని, ఈ కార్య‌క్ర‌మానికి కేవ‌లం స‌న్నిహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు మాత్ర‌మే హాజ‌రు కానున్నార‌ని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. పెళ్లికి ముందు జ‌రిగే సంగీత్ వేడుక‌లో నాగ‌చైత‌న్య- స‌మంత స్పెష‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఎఫ్2తో వెంకటేశ్ ఘన విజయం అందుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్ తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.