టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న లిప్ లాక్ సీన్స్ .. నాని లిప్ లాక్ వైరల్

SMTV Desk 2019-03-22 12:37:45  Natural Star Nani, jersey,

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ లిప్ లాక్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు నాచురల్ స్టార్ నాని. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో నాని హీరోగా వస్తున్న జెర్సీ సినిమా నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజైంది. అదేంటో గాని ఉన్నపాటుగా అంటూ సాగే ఈ పాటని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సాంగ్ లో నాని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తో లిప్ లాక్ చేశాడు. సినిమాలో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. అజ్ఞాతవాసి తర్వాత అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ జెర్సీ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ అవుతుంది.