ఇద్దరు ఉగ్రవాదులు హతం

SMTV Desk 2019-03-22 12:36:57  Terrorists killed,

జమ్ము కాశ్మీర్‌ : సోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో కనీసం పది మంది ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు. దీంతో ఉగ్రవాదులు భద్రతాబలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. హతమైన ఉగ్రవాదులు జైషే సంస్థకు చెందిన వారిగా భావిస్తున్నారు.