మోహన్ బాబు హౌస్ అరెస్టు

SMTV Desk 2019-03-22 12:33:03  mohan babu

తిరుపతి : ప్రముఖ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ ఆలస్యం చేస్తోందని మోహన్‌బాబు ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వేలాది మంది విద్యార్థులతో విద్యానికేతన్‌ నుంచి తిరుపతి వరకు నిరసన ర్యాలీ తీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మోహన్‌ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. నిరసన ర్యాలీ చేయకుండా ఆయనను హౌస్ అరెస్టు చేశారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.