రూ.32.40 కోట్లకు పైగా అప్పులు

SMTV Desk 2019-03-22 12:31:31  Pawan Kalyan,

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల జోరు ఊపందుకుంది. సమయం దగ్గర పడుతోన్న తరుణంలో నామినేషన్లు వేయడానికి నేతలు క్యూ కడుతున్నారు. నామినేషన్ సమయంలో వారి ఆస్తులను, అప్పులను అఫిడవిట్ రూపంలో ప్రకటిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో నామినేషన్ దాఖలు చేశారు. విశాఖలోని జోన్‌-5 కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పవన్ తన పేరిట ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌ను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తన పేరిట రూ.12.79 కోట్ల విలువైన చరాస్థులు, రూ.40 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే తనకు రూ.32.40 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని తెలిపారు.

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర రూ.2.40 కోట్ల మేర అప్పు తీసుకున్నానని పవన్ తెలిపారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ దగ్గర రూ.1.25 కోట్లను రుణంగా తీసుకున్నానన్నారు. తన వదిన సురేఖ దగ్గర రూ.1.07 లక్షల ఆస్తులు తీసుకున్నానని జనసేనాని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎం.ప్రవీణ్ కుమార్‌కు రూ.3 కోట్లు, ఎంవీఆర్ఎస్ ప్రసాద్‌కు రూ.2 కోట్లు, శ్రీ బాలాజీ సినీ మీడియాకు రూ.2 కోట్లు, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రాలయకు రూ.27.55 లక్షలు ఇవ్వాల్సి ఉందని పవన్ తెలిపారు.