కేసీఆర్ బయోపిక్ తీస్తా.. రామ్ గోపాల్ వర్మ

SMTV Desk 2019-03-22 12:26:47  Ram gopal Varma, KCR

సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రముఖుల జీవితాలను తెరకెక్కిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మ తాజాగా ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ తీసిన సంగతి తెలిసిందే. ఆ బయోపిక్ చుట్టూ అనేక వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో నిన్న టీవీ5 చానల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న వర్మ.. తరువాత కేసీఆర్ బయోపిక్ తీస్తా అని వెల్లడించారు. కేసీఆర్ జీవితం ఎంతో నాటకీయంగా ఉంటుందని, ఆయన అనుమతి తీసుకొని బయోపిక్ తీస్తానని వెల్లడించారు.