కనకదుర్గగా వస్తున్న మాస్ మహారాజ

SMTV Desk 2019-03-22 12:22:50  Mass Maharaja,

మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ డైరక్షన్ లో డిస్కో రాజా సినిమా చేస్తున్నాడు. ఓ పక్క ఆ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా మరో సినిమా కన్ఫాం చేశాడు రవితేజ. కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న సంతోష్ శ్రీనివాస్ రవితేజ మూవీ ఫిక్స్ అయ్యిందట. కోలీవుడ్ మూవీ తెరి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే మూల కథ అది అయినా స్క్రీన్ ప్లే మొత్తం మార్చేశారట.

ఇక ఈ సినిమాకు టైటిల్ గా కనకదుర్గ అని పెడుతున్నారట. విజయ్ కెరియర్ లో తెరి అప్పటివరకు ఉన్న సినిమాల కన్నా బెస్ట్ హిట్ అందుకుంది. అట్లీ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగులో పోలీస్ గా రిలీజ్ చేశారు. అయితే విజయ్ కు తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు కాబట్టి ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ సినిమాకు కనకదుర్గ టైటిల్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.