వివేకానందరెడ్డి హత్యకేసు: అర్బన్ సీఐ పై వేటు

SMTV Desk 2019-03-22 12:22:04  Vivekananda reddy,

మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకేసును ఛేదించేందుకు ఆంధ్ర పోలీసులు విపరీతంగా శ్రమిస్తున్నారు. అయితే, హత్య జరిగిన వెంటనే సంఘటన స్థలంలో ఆధారాలు కాపాడడంలో నిర్లక్ష్యపూరిత ధోరణి ప్రదర్శించారంటూ పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్యను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు రేంజ్ డీఐజీ నాగేంద్రకుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. వివేకా హత్య జరిగిన వెంటనే రక్తపు మరకలను కడిగేయడం వంటి చర్యలతో కీలకమైన ఆధారాలు దొరికే అవకాశాలు తగ్గిపోయాయని పోలీసు శాఖ భావిస్తోంది. అంతకుముందు, వైసీపీ నేత అవినాష్ రెడ్డి కూడా సీఐ తీరు పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు.