బీజేపీ నుంచి కొన్ని వేల కోట్లు రావాల్సి ఉందని అన్నాడు పవన్ .. బాబు సంచలనం

SMTV Desk 2019-03-22 12:17:32  Chandra Babu, Pawan Kalyan

గత కొన్ని నెలల నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను పరిశీలించినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అసలు ఎలాంటి విమర్శలు చెయ్యకుండా సైలెంట్ మైండ్ గేమ్ నడిపారు.అయితే దీని వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని అందరు భావించారు.అప్పటి వరకు పవన్ ను తిట్టి పోసి ఇప్పుడేమో ఇలా సైలెంట్ గా ఉండేసరికి అనేక రకాల అనుమానాలు బయటకి వచ్చాయి.దీనితో చంద్రబాబు పవన్ ఇంకా కలిసే ఉన్నారు అన్న ఒక అనుమానం అయితే చాలా మందికే కలిగి ఉండొచ్చు.ఈ సందర్భంలో పవన్ పై చంద్రబాబు మళ్ళీ విమర్శలు కురిపించి ఒక్కసారిగా షాకిచ్చారు.ఒక్క పవన్ కళ్యాణ్ ను మాత్రమేనా ఇటీవలే ఆ పార్టీలో చేరిన మాజీ సిబిఐ అధికారి జేడీ లక్ష్మి నారాయణ పై కూడా విమర్శలు చేసారు.

నిన్న విజయనగరం జిల్లాలోని సాలూరులో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్‌పై ఉన్న 14 కేసుల వివరాలను సీబీఐ మాజీ జేడీ, జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ ప్రజలకు చెప్పాలని తెలిపారు.

అదేవిధంగా జగన్‌ ఆస్తుల కేసును విచారించింది లక్ష్మీనారాయణే కాబట్టి ఆ కుసుల తాలూకూ అన్ని రహస్యాలు ఆయనకే తెలుసని బాబు గుర్తు చేశారు. జగన్‌ మీద ఉన్న 14 కేసుల కథంటే లక్ష్మీనారాయణ చెప్పాలి. జగన్‌పై పెట్టిన కేసులు ఏమయ్యాయి? ఆ కేసులు ఎందుకు పెట్టారు? ఇవన్నీ ప్రజలకు తెలియాలి.. లక్ష్మీనారాయణ నోరు విప్పాలి అని బాబు బహిరంగ సభ సాక్షిగా మాజీ జేడీని కోరారు. ఏపీకి రూ.75వేల కోట్లు రావాల్సి ఉందని పవన్ కల్యాణ్‌ ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చినా.. ఆయన ఆ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

పవన్ ఒకప్పుడు బీజేపీ నుంచి కొన్ని వేల కోట్లు రావాల్సి ఉందని అన్నారని..ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు దాని ఊసే ఎందుకు ఎత్తలేదని సంచలన వ్యాఖ్యలు చేసారు.అయితే సడెన్ గా చంద్రబాబు మళ్ళీ ఇన్ని నెలల తర్వాత పవన్ ను విమర్శించడం కాస్త షాకింగ్ అనే చెప్పాలి.ఒకవేళ లేకపోతే మళ్ళీ దీని వెనుక కూడా చంద్రబాబు ఏమన్నా ప్లాన్ వేసారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది.మరి రానున్న రోజులో ఇది ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.