అకాల వర్షాల వల్ల విలపిస్తున్న రైతులు...పట్టించుకోని అధికారులు

SMTV Desk 2019-03-22 12:02:55  rain, paddy, karimnagar district heavy rain, formers loss

కరీంనగర్, మార్చ్ 21: బుధవారం కురిసిన ఆకాల వర్షానికి పలు చోట్ల వరి,మొక్కజొన్న ,శనగ పంటలు దెబ్బతిన్నాయి. కరీంనగర్ జిల్లాలో గంగాధర మండలంలో వర్షం కురిసిందని వ్యవసాయ ఆధికారులు తెలిపారు. జిల్లాలో మరిన్ని మండలాల్లో కూడా ఆకాల వర్షాలు కురిసి అన్నదాతను కుదేలు చేసింది. కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామంలో బుధవారం కురిసిన వర్షాలకు వరి పైరు తీవ్రంగా నష్టం జరిగిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆధికారులకు కేవలం గంగాధర మాత్రమే ఆకాల వర్షం కురిసిందని మిగతా చొట్ల నుండి సమచారం రాలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల దృశ్య ఆధికారులు ఎన్నికల పని ఏర్పాట్లలో ఉన్నారని జిల్లా వ్యవసాయ ఆధికారి తెలిపారు. కాని కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో, రామడుగు మండలంలోని పలు గ్రామాల్లో ఆకాల వర్షంతో కురిసిన రాళ్లవానతో పంటలకు తీవ్రంగా నష్టం కల్గించాయని రైతులు వాపోతున్నారు. అధికారులు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించాలని బాదిత రైతులు కోరుకుంటున్నారు.