చెన్నైకి బయల్దేరిన బెంగళూరు టీమ్

SMTV Desk 2019-03-22 12:00:38  chennai super kings, Royal Challengers Bangalore, virat kohli, mahendra singh dhoni, ipl 2019

మార్చ్ 21: ఐపీఎల్ 2019 సీజన్లో ప్రారంభ మ్యాచ్ ఆడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్, చెన్నై సూపర్ కింగ్స్ టీంలు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా బెంగళూరు టీమ్ చెన్నైకి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం.. చెపాక్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం రాత్రి 8 గంటలకి టోర్నీ తొలి మ్యాచ్‌లో బెంగళూరు టీమ్ ఢీకొననుంది. ఈ నేపథ్యంలో.. ఈరోజు బెంగళూరు నుంచి బయల్దేరిన కోహ్లీసేన.. చెపాక్‌లో రేపు ప్రాక్టీస్ చేయనుంది. ఐపీఎల్‌లో ఇప్పటికే 11 సీజన్లు ముగియగా.. కనీసం ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ ఈసారి విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ముఖ్యంగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నా.. కెప్టెన్‌గా జట్టుని విజయపథంలోకి నడిపించలేకపోతున్నాడు. దీనిపై రెండు రోజుల క్రితం గౌతమ్ గంభీర్ కూడా విమర్శలు గుప్పించాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌కి మహేంద్రసింగ్ ధోనీ మూడు సార్లు టైటిల్‌ను అందించగా.. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మూడు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడాడు. దీంతో.. విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాడు.