ఒంటరి పోరుకు సిద్దమైన కమల్ హాసన్‌

SMTV Desk 2019-03-22 11:53:46  kamal hasan, mnm party, tamilnadu, puduchherry, lok sabha elections

చెన్నై, మార్చ్ 21: మక్కల్‌ నీది మయ్యామ్‌ పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో పోటీ చేస్తున్నామని తాజాగా ప్రకటించారు. తాజాగా 21 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ జాచితాలో కమల్‌ హాసన్‌ లేరు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ పార్టీని గుర్రపు పందేల్లో పణంగా పెట్టలేమని కమల్‌ తెలిపారు. ఏదైనా పార్టీతో కమల్‌ పోత్తు పెట్టుకుంటారని భావించినప్పటికీ ఒంటరి పోరుకే అయన పిద్ధమయ్యారు. ఒంటరి పోరాటం గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయన మా పార్టీని ఎవరికి అమ్ముకోబోము అని గుర్రపు పందాల్లో పార్టీని ముంచలేము కాబట్టి మాకు ప్రతికూలమైన పరిస్థితులు ఆయితే ఇవి సహజంగా ఏర్పడే ప్రతికూలతలే అని కమల్‌ హాసన్‌ అన్నారు.