బాసర పుణ్యక్షేత్రం వద్ద సైకో వీరంగం

SMTV Desk 2019-03-22 11:51:36  basara temple, psycho

మార్చ్ 21: గురువారం ఉదయం బాసర పుణ్యక్షేత్రం వద్ద భక్తులందరూ ఆలయంలోకి వెళ్తున్నారు. ఇంతలో సాధారణంగా వున్న ఓ వ్యక్తి సైకోలా మారాడు. కత్తులు చేతబట్టుకుని క్షణాల్లో అలజడి సృష్టించాడు. భక్తులందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆలయం బయటకు పరుగులు పెట్టారు. తర్వాత ఆ సైకో ఆలయం బయటకు వచ్చి తానే కత్తులతో పొడుచుకుని చనిపోతానంటూ అరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సైకోను అదుపులోకి తీసుకున్నారు. అతనిది నిజామాబాద్ అని గుర్తించారు. అతను నిజంగానే సైకోనా కాదా అన్న కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అతడికి మెడికల్ టెస్టులు జరుపి, అతని కుటుంబసభ్యులను అడిగి పూర్తిగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు అతణ్ణి తీసుకువెళ్లాక భక్తులందరూ స్థిమితపడ్డారు. తర్వాత యథావిధిగా తమ దర్శనం కోసం అనుమతించారు. భక్తులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆలయ అధికారులు తెలపడంతో భక్తులు ఆలయంలోకి వెళ్లారు.