ఇది ఆమె అహంకారానికి నిదర్శనం : కేంద్ర మంత్రి

SMTV Desk 2019-03-22 11:49:38  priyanka gandhi, central minister, smriti irani, Priyanka Gandhi Accused Of Insulting Lal Bahadur Shastri,

మార్చ్ 21: ఈ మధ్యే రాజకీయరంగ ప్రవేశం చేసిన ప్రియాంకా గాంధీకి అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొన్నీమద్యే ఓ ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడి భక్తులు మోదీ మోదీ అంటూ నినాదాలు చేయడంతో అక్కడి నుండి వెనుదిరిగింది. ఇక తాజాగా చిక్కుల్లో ఇరుకున్నారు ప్రియాంక. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ గంగానదిలో ఆమె పడవ ప్రయాణం చేస్తూ ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి నివాళులర్పించారు. అయితే ఆమె తొందరలో ఓ తప్పు చేశారు. తన మెడలోని ఓ పూలదండను తీసి, శాస్త్రి విగ్రహానికి వేశారు. అది గమనించిన బీజేపీ నాయకులు‌.. లాల్ బహదూర్‌ను ప్రియాంక అవమానించారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్విటర్‌లో షేర్ చేసి రచ్చ చేస్తున్నారు. ‘ప్రియాంక వినియోగించిన పూలమాల శాస్త్రి మెడలో వేసి ఆయను అవమానించారు. ఇది ఆమె అహంకారానికి నిదర్శనం’ అని రాశారు. దీనిపై బీజేపీ నాయకులు కూడా మండి పడుతున్నారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ.. విమర్శల వర్షం కురిపిస్తున్నారు.