పవన్ కు డ్యాన్స్ చేయడం రాదు, కేఏ పాల్ ఎద్దేవా ...

SMTV Desk 2019-03-22 11:43:00  Pawan Kalyan, KA PAul

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే అయితే తనకు డ్యాన్స్ చేయడం రాదని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎద్దేవా చేశారు. అంతేకాదు, వేదికపై పవన్ కల్యాణ్ స్టెప్పులు వేశారు. చిరంజీవితో పోల్చితే పవన్ కు డ్యాన్స్ చేయడం రాదని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నానని... దమ్ముంటే పవన్ కల్యాణ్, నాగబాబు తన విజయాన్ని అడ్డుకోవాలని సవాల్ విసిరారు. పవన్, జగన్, చంద్రబాబులకు ఓటు వేయరాదని... వారంతా సీట్లను అమ్ముకుని, రాష్ట్రాన్ని దోచుకుంటారని విమర్శించారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తానని చెప్పారు.