సినిమాలో అవకాశం అని చెప్పి కోరిక తీర్చమన్న దర్శకుడు

SMTV Desk 2017-08-10 16:55:05  directer, movie auditions, 19 years old girl

పూణే, ఆగస్ట్ 10 : తన కోరిక తీరిస్తే సినిమాలో నటించే అవకాశం ఇస్తానని ఓ దర్శకుడు అడిగిన సంఘటన పూణేలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని జెజూరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయి, తన కళాశాలకి సెలవులు ప్రకటించడంతో ఇంటికి చేరుకుంది. కాగా ఆమెకు తాము కొత్తగా తీయబోయే సినిమాకు హీరోయిన్ గా నటించే౦దుకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని వాట్సప్ మెసేజ్ వచ్చింది. దీంతో ఆ యువతి తిరిగి పూణే చేరుకుని వాట్సప్ లో సూచించిన అడ్రస్ కు వెళ్ళింది. అయితే ఆడిషన్ నిర్వహించాల్సిన దర్శకుడు అప్పా పవార్ ఆమెకు ఆడిషన్ చేయకుండానే తనతో గడిపితే సినిమాల్లో నటించే అవకాశం ఇస్తానని చెప్పాడు. దీంతో భయపడ్డ యువతి, నిరాశగా ఇంటికి చేరుకు౦ది. బాగా అలోచి౦చి అతనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు అప్పా పవార్ కోసం గాలింపు చేపట్టారు.