ఎన్నికల తేదీనే మార్చేసిన నారా లోకేష్ – మరోసారి నోరు జారిన మంత్రి

SMTV Desk 2019-03-22 11:38:17  Nara Lokesh,

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి నోరు జారారు. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయన్న సంగతి పిల్లలు, పెద్దలు అందరికి తెలిసిందే. కానీ, నారా వారబ్బాయి లోకేష్ మాత్రం ఏప్రిల్ 9న ఓటేయాలని ఓ బహిరంగ సభలో ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ, జనసేన శ్రేణులు ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ, విపరీతంగా ట్రోల్ చేసేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంగళగిరిలో లోకేశ్ పై పోటీచేస్తున్న వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. ట్విట్టర్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ,”నారా లోకేశ్ అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న టీడీపీకి ఓటు వేయండి. ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటువేయండి.” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.