తెరాస గూటికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే

SMTV Desk 2019-03-22 11:33:30  cholapalli prathap reddy,

టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. 2018 ఎన్నికల్లో గెలిచిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా గులాబీ కండువా కప్పుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరపున పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ చేతిలో ఓడిపోవడం జరిగింది. గురువారం రోజున మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, టీఆర్ఎస్ నేత జూపల్లి భాస్కర్‌లతో కలిసి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఆయన రేపు మధ్యాహ్నం అధికారికంగా టీఆర్ఎస్ గండువా కప్పుకోనున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరనున్నారు.