జైల్లో ఉన్నందుకు అవకాశం ఇవ్వాలా?

SMTV Desk 2019-03-22 11:31:21  Naralokesh, Jagan

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో అక్కడ ఉన్న మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసాయి.ఇక ఎన్నికల ప్రచారం అంటే తెలిసినదే కదా ప్రచారం చేసే వారు తమకి తప్ప ఇంకెవ్వరికీ అవకాశం ఇవ్వొద్దని,అసలు వారికెందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తారు.ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సారి ఎన్నికల్లో గెలవాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు,అందుకు తగ్గట్టుగానే జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు.దీనితో ఏ సర్వేలో చూసినా సరే ఈ సారి జగన్ కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టం కట్టనున్నారని తెలుస్తుంది.అందులో భాగంగానే జగన్ కూడా ఒక్కసారి తనకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు.

ఈ మాటలపై టీడీపీ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరిలో తన ప్రచారంలో జగన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.అసలు జగన్ కు ఎందుకు అవకాశం ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు.జగన్ కు ఏ అనుభవం ఉందని ఇలా ప్రజలను అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని,అసలు ఎలాంటి పరిపాలనా అనుభవం లేని వ్యక్తికి ఎందుకు అవకాశం ఇవ్వాలని అన్నారు.ఇదే సందర్భంలో 16 నెలలు అవినీతి కేసుల్లో జైల్లో ఉన్నందుకు అవకాశం ఇవ్వాలా? 28 ఛార్జ్ షీట్లు ఉన్న అవినీతి పరుడు అయిన జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు అవకాశం ఇవ్వాలని సంచలన వ్యాఖ్యలు చేసారు.