తనయుడికి సచిన్ సూచనలు

SMTV Desk 2019-03-21 18:02:14  sachin tendulkar, arjun tedulkar

న్యూఢిల్లీ, మార్చ్ 21: క్రికెట్ ఆటగాల్లల్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌కు ఉన్న ఇంటిపేరు అతడిపై ఎంత ఒత్తిడిని తెస్తుందో తెలిసిందే. అయితే అర్జున్ నిద్రలేచిన ప్రతిరోజూ ఉదయం తన కలలను సాకారం చేసేందుకు ప్రయత్నించాలని అతనికి తన తండ్రి సచిన్ టెండూల్కర్‌ సలహా ఇచ్చాడు. గతేడాది టీమిండియా అండర్‌-19 జట్టు తరుపున రెండు టెస్టులు ఆడిన అర్జున్‌, ఇటీవలే ముంబయి అండర్‌-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు త్వరలో ముంబై టీ20 రెండో సీజన్‌లో అర్జున్‌ మొదటిసారి ఆడుతున్నాడు.