బుల్లెట్ తగిలి జింక మృతి

SMTV Desk 2019-03-21 17:56:24  deer, hyderabad central university, deer died in bullet shot

హైదరాబాద్, మార్చ్ 21: హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటిలో ఈ రోజు ఓ జింక అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. అయితే గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటి లోని షూటింగ్ రేంజ్ దగ్గర బుల్లెట్ తగిలి జింక మృతి చెందిందని యూనివర్సిటి విద్యార్థులు ఫారెస్టు అధికారులుకు ఫిర్యాదు చేశారు. కాగా విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని జింకను పోస్టుమార్టానికి పంపారు.. పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.