లిప్ లాక్ పై రష్మిక స్పందన

SMTV Desk 2019-03-21 17:50:35  LIp lock, Rashmika

యంగ్ హీరో విజయ్ దేవరకొండ , కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తున్న రెండో సినిమా డియర్ కామ్రేడ్. గీత గోవిందం సినిమాలో నటించిన ఈ జంట మంచి ఆన్ స్క్రీన్ అప్పియరెన్స్ తో జనాన్ని ఆకట్టుకున్నారు, అందుకే వీరి జంట మరో మారు రిపీట్ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ లో వున్న లీడ్ పెయిర్ లిప్ లాక్ సీన్ ఫై విమర్శలు వచ్చాయి.

దాంతో తాజాగా రష్మిక ఆ సన్నివేశం ఫై స్పందించింది. పాత్ర డిమాండ్ మేరకే ఆ సన్నివేశం చేశానని తన వరకు తనకి ఇచ్చిన పాత్ర కు న్యాయం చేయడమే తన కర్తవ్యం అని రష్మిక చెప్పుకొచ్చింది. నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మే 31న ఈ చిత్రం అన్ని సౌత్ భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి విజయ్ మేనమామ యష్ రంగినేని బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.