ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేను

SMTV Desk 2019-03-21 17:47:38  AP Elections, Revanth reddy ,

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తిరిగి నిలబెట్టుకునేందుకు టీడీపీ, అధికారం చేపట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ నేతలు జోస్యం చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 120-130 సీట్ల వరకు వస్తాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు.

ఈ నేపథ్యంలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై స్పందించేందుకు నిరాకరించారు మాజీ టీడీపీ నేత, ప్రస్తుత కాంగ్రెస్ లీడర్ రేవంత్‌రెడ్డి. ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తాను చెప్పలేనని, పొరుగు రాష్ట్రం రాజకీయాల గురించి తనకు అవసరం లేదన్నారు. ఏపీ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని, అక్కడ జరుగుతున్న సంఘటనలపై స్పందించాల్సిన అవసరం కూడా తనకు లేదన్నారు. తనకు తెలంగాణే ముఖ్యమని పేర్కొన్నారు.