గుండెపోటుతో కుప్పకూలిపోయిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే

SMTV Desk 2019-03-21 17:41:15  MLA Dies,

ఈరోజు ఉదయం దిన పత్రిక చదువుతూ ఓ ఎమ్మెల్యే గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే కనగరాజ్ తన నివాసంలో ఈరోజు ఉదయం పేపర్ చదువుతున్న సమయమ్లో గుండెపోటుకు గురికావడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, కనగరాజ్‌ను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కనగ రాజ్ సుళ్లురు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున విజయం సాధించారు. కనగరాజ్ మృతితో తమిళనాడు అసెంబ్లీలో ఖాళీ స్థానాల సంఖ్య 22కు చేరుకుంది. . తమిళనాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు పదిశాతం స్థానాలు ఖాళీగా ఉండటం రాష్ట్ర చరిత్రలోనే ఇది ప్రథమం. 39 లోక్‌సభ స్థానాలతో పాటు, ఎమ్మెల్యేల మరణాలతో ఏర్పడ్డ ఖాళీలతో పాటు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

2016 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు ఐదుగురు ఎమ్మెల్యేలు మరణించారు. ప్రస్తుత అసెంబ్లీ కాలంలో కనీసం ఐదురుగు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత (ఆర్కేనగర్), డీఎంకే నేత కరుణానిధి (తిరువళ్లూరు), శ్రీనివేల్‌, ఏకే బోస్‌ (తిరుప్పరంగుండ్రం), కనగరాజ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. వీరిలో నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కాగా, మరొకరు డీఎంకే చీఫ్‌. ఇటీవలే అన్నాడీఎంకే ఎంపీ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరి 23న విల్లుపురం ఎంపీ రాజేంద్రన్ చైన్నైకు వస్తుండగా తిండివనమ్ వద్ద ఆయన ప్రయాణిస్తు వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారు.