నచ్చలేదని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది : హీరో విజయ్

SMTV Desk 2017-08-10 16:18:36  MUMBAI, HERO VIJAY, AUDIANCE, TWITT, MOVIE

ముంబై, ఆగస్ట్ 10 : ఇటీవల షారూఖ్ ఖాన్ నటించిన ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ సినిమా దారుణమైన ఫలితాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా చూసిన ఓ మహిళా జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్‌.. ఈ సినిమా చూస్తుంటే విజయ్ సినిమా “సురా” గుర్తుకొచ్చిందని, కనీసం ఇంటర్వెల్ వరకు కూడా ఆ సినిమా చూడలేకపోయానని వ్యాఖ్యలు చేయడంతో విజయ్ అభిమానులు ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ 63,000 ట్వీట్లలో ఆమెను దూషించారు. కొంతమంది ఆమెను బెదిరించారు కూడా. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విజయ్ స్పందిస్తూ.. “మహిళల పట్ల నాకు గౌరవం ఉంది. సినిమా నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే స్వేచ్ఛ ఎవ్వరికైనా ఉంటుంది. కాబట్టి మహిళల గురించి తప్పుగా మాట్లాడం వంటివి చేయొద్దు, ఆమెను గౌరవించండి” అంటూ అభిమానులకు సూచించారు.