మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే

SMTV Desk 2019-03-21 17:33:02  Hurt, died

ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి కోపం రావడం తద్వారా మనసు విరగడం కామన్ అయిపోయింది అయితే ఇలా అవడం వల్ల మన ప్రాణాలకే ముప్పు ఉంది అంటున్నారు పరిశోధకులు .. మనసు విరిగితే.. నిజంగా చనిపోతారా? డాక్టర్లు నిజమే అంటున్నారు. దీనికి కారణం.. మీ మెదడు. అవును బాధ, భయం, కోపం వంటి భావోద్వేగాలు మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని తాజా అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.

మనసుకు చాలా కష్టం కలిగినప్పుడు మెదడు ఎంతో ఒత్తిడికి గురవుతుందని పరిశోధకులు గుర్తించారు.మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే అది ఆయుష్షును క్షీణింప చేస్తుందని గతంలో జరిపిన పరిశోధనలు కూడా వెల్లడి చేశాయి.

కొన్నేళ్ళ కిందట లండన్‌లోని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు 68,000 మంది వయోజనులను అధ్యయనం చేశారు. ఒత్తిడి, ఉద్వేగాలు మృత్యువును చేరువ చేస్తాయని ఈ అధ్యయనం వెల్లడి చేసింది.