‘వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్’ ఇండియా ర్యాంక్ ఎంత ?

SMTV Desk 2019-03-21 17:32:00  India. World Happiness Index

బుధవారం రోజున వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా ఐక్యరాజ్య సమితి ‘వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్’ ను విడుదల చేసింది. ఈ జాబితాలో ఈ ఏడాది ఇండియా 140వ స్థానంలో నిలిచింది. గతేడాది 2018లో ఇండియా 133వ స్థానంలో నిలవగా ఈసారి 7 స్థానాలు వెనక్కి దిగజారిపోయింది. ఈ సంవత్సరం కూడా ఫిన్లాండ్‌ మొదటిస్థానంలో నిలిచింది. ఆదాయం, స్వేచ్ఛ, విశ్వాసం, ఆరోగ్యకర జీవన విధానం-ఆయుష్షు, సామాజిక మద్దతు, వితరణ తదితర అంశాలను ఈ జాబితాకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.

ఈ నివేదిక ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ఆనంద సూచీ పరిస్థితి అంతకంతకూ తగ్గుతూనే వచ్చింది. డెన్మార్క్‌, ఐస్‌ల్యాండ్‌, నెదర్లాండ్స్‌, నార్వే దేశాలు జాబితాలో ఫిన్లాండ్‌ తర్వాత నిలిచాయి. దాయాది పాకిస్తాన్ దేశం 67వ ర్యాంకులో నిలవగా, చైనా 93వ ర్యాంకును సాధించింది. ఇక, ఆనందానికి ఆమడదూరంలో బతుకీడుస్తున్న దేశాల్లో సూడాన్‌, ఆఫ్ఘానిస్థాన్‌, టాంజానియా, రువాండాలు ఉన్నాయి.