వైసీపీ లోకి మరో సినీ ప్రముఖుడు

SMTV Desk 2019-03-21 17:23:40  YCP, Shivaji raja,

అమరావతి, మార్చ్ 21: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి సినీ రంగం నుండి వలసలు మరింత ఎక్కువయ్యాయి, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ నటుడు, సహృదయుడు “మా” తాజా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా వైసీపీలో చేరనున్నారట, ఆయన కాసేపట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు సమాచారం అందుతోంది. కాగా, ప్రచారానికి ఈరోజు బ్రేక్ ఇచ్చిన జగన్ లోటస్ పాండ్ లోనే ఉండగా, మరో పక్క శివాజీరాజా ఇప్పటికే జగన్ అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారట.

ఇదివరకే పలువురు సినీ ప్రముఖులు వైసీపీలో చేరగా, శివాజీరాజా కూడా వైసీపీలో చేరనున్నారని ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో 2019 ఎన్నికల నేపథ్యంలో సినీ గ్లామర్ ఎక్కువగా వైసీపీ వైపే ఉన్నట్లవుతుంది. మరి, భారీ స్థాయిలో వచ్చి చేరుతున్న సినీ గ్లామర్ వాల్ల రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఏ మేరకు లాభం చేకూరుతుందో చూడాలి.