గ్రామ పెద్ద కోసం క్లబ్ గా మారిన పాఠశాల

SMTV Desk 2017-08-10 15:42:54  SCHOOL, HOLIDAY, DANCE CLUB, SOCIAL MEDIA

ఉత్తరప్రదేశ్, ఆగస్ట్ 10 : యూపీలోని మీర్జాపూర్ గ్రామంలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలానికి దారి తీసింది. మంచి చెప్పాల్సిన ఓ గ్రామ పెద్ద, విద్య బుద్దులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు చేసిన పనికి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వివరాలిలా ఉన్నాయి.. ఆ ఊరి గ్రామ పెద్ద అయిన రాకేష్ యాదవ్ పుట్టిన రోజు వేడుకల కోసం స్కూల్ మొత్తానికి సెలవు ప్రకటించాడు ఆ ఉపాధ్యాయుడు. అంతేకాకుండా బయటి నుంచి అమ్మాయిలను తెప్పించి వారిచేత అర్థనగ్న నృత్యాలు చేయించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. విద్యార్థులు కూర్చునే బెంచీలు, రాసుకునే బల్లలు సైతం మందు బాటిళ్ళు పెట్టుకునే టేబుల్స్ గా మారాయి. ఈ విషయంపై మరో ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు అందుకున్న అధికారులు విచారణ జరిపి, విద్యాశాఖకు నివేదికను అందించారు. ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అసలు తానూ అక్కడ లేనని, తన బంధువుల ఇంట్లో ఉన్నట్లు ఆ గ్రామ పెద్ద చెప్పడం గమనార్హం.