పాక్ డ్రోన్ల ఎత్తుగడను చిత్తు చేసేందుకు భారత ఆర్మీ చర్యలు

SMTV Desk 2019-03-21 15:59:20  Pakistan, India,

పుల్వామా ఉగ్ర దాడి, భారతవాయుసేన పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపిన అనంతరం పాకిస్థాన్ సరిహద్దుల్లో ఆయుధాలతో కూడిన డ్రోన్లను రంగంలోకి దించిందని భారత సరిహద్దు భద్రతాదళం తన రహస్య నివేదికలో వెల్లడించింది. పాక్ సరిహద్దుల్లోని ఉరి, పూంచ్, రాజౌరి, నౌషెరా, సుందర్ బనీ తదితర 12 ప్రాంతాల్లో పాక్ ఆయుధాలతో కూడిన డ్రోన్లను రంగంలోకి దించిందని బీఎస్ఎఫ్ పేర్కొంది. గుజరాత్ రాష్ట్ర సరిహద్దుల్లో ఎగురుతున్న పాక్ డ్రోన్ ను భారత సైన్యం ఇటీవల కూల్చివేసింది. పాక్ డ్రోన్లతో సరిహద్దుల్లో నిఘా వేయడంతో మన భారత సైన్యం అప్రమత్తమైంది. పాకిస్థాన్ గత ఏడాది చైనా నుంచి 48 వింగ్ లూంగ్ డ్రోన్లను కొనుగోలు చేసింది. పాక్ మిలటరీకి తమ వంతు సాయం చేస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గతంలోనే ప్రకటించారు. సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు ఎగురుతున్న నేపధ్యంలో బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి. పాక్ డ్రోన్ల ఎత్తుగడను చిత్తు చేసేందుకు భారత ఆర్మీ చర్యలు చేపట్టింది.