పవన్ కళ్యాణ్ పై గెలుస్తా

SMTV Desk 2019-03-21 15:58:15  pawan Kalyan,

జనసేన పార్టీ శ్రేణులు పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం విషయంలో ఎంతగా ఎదురు చూసారో అందరికి తెలుసు.వారందరి ఆశలకు తెర దించుతూ పవన్ విశాఖ జిల్లా గాజువాక మరియు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పోటీ చేస్తారని ప్రకటించేసారు.ఈ వార్త తెలిసినటువంటి పవన్ అభిమానుల ఆనందానికి అయితే హద్దుల్లేవు,భీమవరం సంగతి పక్కన పెడితే గాజువాకలో అయితే పవన్ ఎవరు ఊహించని రేంజ్ విజయాన్ని అందుకుంటారని జనసేన శ్రేణులు మరియు పవన్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇదిలా ఉండగా తనకి ఎదురుగా ప్రత్యర్థి ఎవరున్నా అనవసరం అని అదే గాజువాకలో నుంచి నిలబడ్డ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అంటున్నారు.ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలు తనపై పని చేయవని తాను ఈ ఎన్నికల్లో పవన్ పై గెలిచి తీరుతానని ఇక్కడి ప్రజలే తనని మళ్ళీ గెలిపిస్తారని అంటున్నారు,ఎందుకంటే గాజువాక నియోజకవర్గాన్ని తాను 30 ఏళ్లుగా చూస్తున్నానని నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో పాటు పడ్డానని ఇక్కడ పూర్తి అవగాహన తనకే ఉందని అందుకే పవన్ ఇక్కడ గెలవలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరి గాజువాక నియోజకవర్గంలో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..