దుమ్ములేపుతున్న టీ సిరీస్ యూట్యూబ్ చానల్

SMTV Desk 2019-03-21 15:45:39  T series , paddy

ప్రపంచ దిగ్గజ యూట్యూబ్ చానళ్లకు మన దేశీయ చానళ్లు గట్టి పోటీనిస్తున్నాయి. లక్షల్లో సబ్ క్రైబర్స్‌ను పెంచుకుంటూ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తాజాగా ఇండియాలో ప్రముఖ మ్యూజిక్ కంపెనీగా పేరుగాంచిన టీ సిరీస్, ప్యూడీపై అనే స్వీడన్ యూట్యూబ్ చానల్‌కు మధ్య ఆన్‌లైన్‌లో సబ్ క్రైబర్స్ యుద్ధం జరుగుతోంది.

వార్త రాసే సమయానికి టీ సిరీస్ యూట్యూబ్ చానల్ కు 90,284,426 సబ్ క్రైబర్స్ ఉండగా.. ప్యూడీపై యూట్యూబ్ చానల్‌కు 90,186,100 మంది సబ్ క్రైబర్స్ ఉన్నారు. గతంలో ప్యూడీపై కంటే చాలా వెనుకబడి ఉన్న టీ సిరీస్.. ఇప్పుడు దాన్ని దాటుకుని మరీ దూసుకెళ్తోంది. దీంతో స్వీడన్ కు చెందిన ప్యూడీపై యూట్యూబ్ చానల్ ను వెనక్కి నెట్టేసింది. ఈ రెండు చానళ్ల మధ్య కొనసాగుతున్న పోరును చూసి వాటి అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు వాటిని సబ్ క్రైబ్ చేసుకోవాలంటూ రికమెండ్ చేస్తున్నారు.