గూగుల్‌కు రూ. 11,730 కోట్లపైచికులు జరిమానా

SMTV Desk 2019-03-21 15:08:31  Google,

అమెరికాకు చెందిన ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్‌ గూగుల్‌కు మళ్లీ భారీ జరిమానా పడింది. యూజర్లకు నమ్మకం ద్రోహంతోపాటు ఇతర కంపెనీలను పోటీ పడకుండా అడ్డుకుందంటూ యూరోపియన్‌ యూనియన్‌ యాంటీ ట్రస్ట్‌ రెగ్యులేటరీ దిమ్మతిరిగే శిక్ష వేసింది. రూ. 11,730 కోట్లపైచికులు జరిమానా వడ్డించింది. పేరున్న ఈ సెర్చింజిన్‌ తన విధులను విస్మరించి విశ్వాసం పోగొట్టుకుందని కోర్టు ఆక్షేపించింది.

ఈయూ కాంపిటీషన్‌ కమిషనర్‌ మార్గరెట్‌ వెస్టాగర్‌ ఈ వివరాలు వెల్లడించారు. గూగుల్ సంస్థకు 1.49 బిలియన్‌ యూరోల జరిమానా చెల్లించాని యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ ఆదేశించందని తెలిపారు. ‘ఆ సంస్థ అంతర్జాతీయ మార్కెట్‌లో తనకున్న మంచి పేరును, అధికారాలను దుర్వినియోగం చేసింది. ఈ సంస్థలో కొన్ని కంపెనీలు భారీ లాభాలు సంపాదిస్తున్నాయి. కానీ వినియోగదారులు మాత్రం మోసపోతున్నారు. గూగుల్ తన యూజర్లను ఇబ్బంది పెడుతోంది. వారి ముందున్న ఆప్షన్లను కట్టడి చేస్తోంది. పదేళ్లుగా ఇతర కంపెనీలపై ఆధిపత్యం చలాయిస్తోంది. ఇదిలాగే జరిగే కంపెనీ దారునంగా దెబ్బతింటుంది..’ అని హెచ్చరించారు. విశ్వాస ద్రోహం కింద గూగుల్ సంస్థకు ఇదివరకు కూడా పలు కోర్టులు భారీ జరిమానాలు వేశాయి. తాజా జరిమానాతో మొత్తం పెనాల్టీల మొత్తం రూ. 72 వేల కోట్లకు చేరింది.