అమెరికా అధినేతకు అనుమతి లభించింది

SMTV Desk 2017-08-10 14:22:26  USA, North Korea, Trump, robert jeffress, evangelical

అమెరికా, ఆగస్ట్ 10: గత కొద్దికాలంగా అమెరికా-ఉత్తర కొరియాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ విషయంలో ఉత్తర కొరియాకు బుద్ధి చేప్పే ఆలోచనలో ఉన్న అమెరికా అధ్యక్షుడికి ఊహించని వ్యక్తి మద్దతు తోడయింది. దేశంలో యుద్ధ నీడలు అలుముకున్నప్పుడు, వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, శాంతి, సహనాలను ప్రబోధిస్తూ, చర్చలను మాత్రమే ప్రోత్సహించే ఎవాంజలికవ్ వర్గం ఆయనకు మద్దతిచ్చింది. ఎవాంజలికల్ సలహాదారు రోబెర్ట్ జెఫెర్స్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, బైబిల్‌లోని రోమన్స్ చాప్టర్‌లో స్పష్టంగా పేర్కొన్న విధంగా దేశ రక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం ఉత్తర కొరియాపై బాంబు దాడులు చేసేందుకు దేవుడి నుంచి అనుమతి లభించిందని అన్నారు. ఆయన టెక్సాస్ లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో వేలాది మందిని ఉద్దేశించి మాట్లాడుతూ... దుష్ట శక్తులను అంతం చేయడానికి అధినేతకు అనుమతి లభించిందన్నారు. కాగా ఇటీవల ఉత్తర కొరియా అధికారి ఒకరు గువాం దీవిపై దాడి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో ట్రంప్‌కు రోబెర్ట్ జెఫెర్స్ లాంటి మద్దతుదారులు పెరిగితే, తక్షణం నార్త్ కొరియాపై అణుదాడికి ఆయన అనుమతిస్తారని ప్రచారాలు సాగుతున్నాయి.