గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే నేను ప్రధాని కాలేనా

SMTV Desk 2019-03-21 14:01:44  kishan jung

బీహార్ రాష్ట్రంలోని కిషన్‌గంజ్‌లో చోటేలాల్ మహతో అనే వ్యక్తి తెలియనివారు ఉండరంటే అతియోశక్తి కాదు. అలాగని ఆయన ఒక సెలెబ్రిటీ అనుకుంటే పొరబడినట్లే. చోటేలాల్ ఇంటింటికీ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే సాధారణ వ్యక్తి. కానీ ఎన్నికలు వస్తే చాలు అంతా ఆయన రాక కోసం ఎదురుచూస్తారు. ఎన్నికల్లో సెలెబ్రిటీలు, డబ్బున్నవారు మాత్రమే పోటీ చేయాలని కొందరిలో ఉన్న భావనను నుంచి తొలగించడానికి ఎన్నో ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఐదు సార్లు అసెంబ్లీకి మూడు సార్లు లోక్‌సభ‌కు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసారు. ఇలా ఎందుకు మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. చాయ్ అమ్ముకునే మోదీ ప్రధాని కాగా లేనిది గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే నేను ప్రధాని కాలేనా అని బదులిచ్చాడు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో చోటేలాల్ కిషన్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. ఆయనకు 11400 ఓట్లు లభించాయి. ఈసారి కూడా అదే సీటు నుంచి పోటీ చేయాలనీ భావిస్తున్నాడు. ఛోటేలాల్‌ తన వృత్తిని వదులుకోరు. ఇంటింటికీ గ్యాస్‌ సిలిండర్లు మోసుకెళ్తూ ఓట్లడుగుతుంటారు. జనం నుంచి తనకు చాలా మద్దతు లభిస్తోందని, కొంతమంది ఆర్థిక సహాయం చేసేందుకూ ముందుకొస్తున్నారని చెబుతున్నారు చోటేలాల్.