ఇథియోపియాలో హైదరాబాద్ వాసి దుర్మరణం

SMTV Desk 2019-03-21 14:00:19  ithiyopia, hyderabad

పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన హైదరాబాద్ వాసులు దుండగుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల న్యూజిలాండ్ మసీదులో శ్వేతజాత్యహంకారి జరిపిన కాల్పుల్లో ఇద్దరు హైదరాబాదీలు చనిపోవడం తెలిసిందే. తాజాగా ఆఫ్రికా దేశమైన ఇథియోపికాలో మరో హైదరాబాదీ బలయ్యాడు.

అతనిపాటు మరో నలుగురు ప్రయాణిస్తున్న కారును గుర్తుతెలియని దుండగులు అడ్డుకుని నిప్పంటించారు. కారులోని ఐదుగురూ వ్యక్తులు సజీవదహనమయ్యారు. మంటల్లో చిక్కుకున్న వారంతా తప్పించుకునేందుకు కూడా వీలు లేకపోవడంతో అందులోనే కాలిబూడిదయ్యారు. మృతుల్లో ఒకరిని హైదరాబాద్ లోని అశోక్ నగర్‌కు చెందిన పావని వెంకట శశిధర్‌గా గుర్తించారు. మిగతా నలుగురి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.