నారా లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం

SMTV Desk 2019-03-21 13:59:04  na lokesh,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన విస్తృత ప్రచారంతో దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి నిడమర్రులో ప్రచారం చేసిన ఆయన ఓ హోటల్ వద్ద ప్రసంగిస్తున్న సమయంలో హోటల్‌కు సంబంధించిన బోర్డు ఒకటి అకస్మాత్తుగా కుప్పకూలింది. అయితే, అది లోకేశ్ పక్కనే కూలడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆ బోర్డు కార్యకర్తల మీద పడినప్పటికీ పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బోర్డు కూలిన సమయంలో లోకేశ్ పక్కనే గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, పలువురు ముఖ్యనేతలు కూడా అక్కడే ఉన్నారు.