హోళీ పండుగ విశిష్టత

SMTV Desk 2019-03-21 13:53:44  Holi,

మనకు రకరకాల పండుగలు ఉన్నాయి. ప్రతి పండుగనాడు ఎవరో ఒక దేవత/దేవుడిని పూజిస్తారు. కానీ ఒక్క పండుగకు మాత్రం ఏ దేవుడిని ప్రత్యేకంగా పూజించని పండుగ. ఏ పండుగా అంటే అదే హోళీ పండుగ. ఈ పండుగ రోజు ప్రత్యేకించి ఏ దేవతను ఆరాధించరు. ముందురోజు కామదహనం అంటే మనలోని కామాలను (కోరికలను) దహనం చేసే కార్యక్రం చేస్తారు. అనవసర కోరికలు ఉండకుండా కేవలం ధర్మబద్ధమైన కోరికలను మాత్రమే ఉండాలనేది దీని అర్థం. తెల్లవారి అందరూ కలిసి ఆనందంగా ఉత్సాహంగా రంగులు, రంగునీళ్లు చల్లుకొని సమూహికంగా నిర్వహించుకునే పండుగ ఇది.

భారతదేశం అంటేనే సనాతన ధర్మానికి, అనేక ప్రత్యేకతలకు ప్రతీక. ఎన్నో శతాబ్దాలకు పూర్వమే అనేక అద్భుతాలను ఆవిష్కరించిన దేశం మనది. అపురూప శిల్పాలు, కళలు, నఋత్యాలు, నీటిపై తేలాడే దేవాలయాల నిర్మాణాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో విశేషాలు. ఇక పండుగలు అంతే.. ప్రకృతితో మమైకం అయ్యేవి, దేవతారాధనలు విశేషాలు ఎన్నో. వీటన్నింటిలో విభిన్నమైన హోళీ ఏ దేవతకు సంబంధం లేనిది.