కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోకు ఈసీ నోటీసులు

SMTV Desk 2019-03-21 13:51:38  central minister, bjp, Babul Supriyo, Member of Parliament, Lok Sabha, election commission of india

లక్నో, మార్చ్ 20: కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడంటూ అతనికి ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాలకు సంబంధించి .. మీడియా సర్టిఫికేషన్‌ లేకుండానే సుప్రియో ఓ పాటను ప్రచారంలోకి తెచ్చారని అందుకే నోటీసులు జారీ చేశామని ఎన్నికల సంఘం వెల్లడించింది. దీనిని ‘మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌’ ఉల్లంఘన కింద పరిగణించాల్సి వస్తుందనీ సుప్రియోకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. ఈ పాటకు సంబంధించి టిఎంసి కూడా ఇదివరకే ఫిర్యాదు చేసిందని ఈసీ అధికారులు వెల్లడించారు.