హైదరాబాద్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లు

SMTV Desk 2019-03-21 13:33:35  ipl 2019, sunrisers, hyderabad, uppal stadium

హైదరాబాద్, మార్చ్ 20: మార్చి 23 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ పూర్తి షెడ్యూల్ ను బిసిసిఐ తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఎప్పుడూ ఒక్కటిగా వుండే టీమిండియా అభిమానులు ఐపిఎల్ లో మాత్రం రాష్ట్రాలవారిగా విడిపోయి తమ తమ జట్లకు సపోర్ట్ చేస్తుంటారు. ఇలా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ గా చేయడానికి కూడా తెలుగు అభిమానులు సిద్దమయ్యారు. ఇలా తమ జట్టుకు మరోసారి టైటిల్ విజేతగా నిలిపేందుకు తమ వంతుగా సన్ రైజర్స్ ఆటగాళ్లను మైదానంలో సపోర్ట్ చేయడానికి కూడా ఇరు తెలుగు రాష్ట్రాల అభిమానులు కూడా సిద్దమయ్యారు. ఈ నెల 29 తేదీన ఉప్పల్ మొదటి మ్యాచ్ జరగనుంది.


హైదరాబాద్ మ్యాచుల షెడ్యూల్

**మార్చి 29: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రాజస్తాన్‌ రాయల్స్‌ .

**మార్చి 31: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(హైదరాబాద్‌).

**ఏప్రిల్ 6: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ముంబై ఇండియన్స్‌.

**ఏప్రిల్ 14: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ఢిల్లీ కేపిటల్స్‌.

**ఏప్రిల్ 17: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌.

**ఏప్రిల్ 21: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌.

**ఏప్రిల్ 29: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ - కింగ్స్‌ లెవెన్ పంజాబ్‌.